పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి.17.2026 సోమవారం నాడు"ఆదివాసి సంక్షేమ పరిషత్ (274/16)"ఆధ్వర్యంలో రంపచోడవరం ఐటిడిఏ ఎదుట శాంతియుత నిరసన చేపట్టారు అనంతరం. గ్రీవెన్స్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ వారికి పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేసి. జాయింట్ కలెక్టర్‌కు వివరించడం జరిగింది. గంగవరం మండలం రాజంపాలెం గ్రామంలో నాన్ ట్రైబల్స్ ఆదివాసి పట్టా భూములను అక్రమంగా. కబ్జా చేసి పంటను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని,అంతేగాక ఆదివాసులు పైన తప్పుడు కేసులు పెట్టి పోలీసులు చేత బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలియజేశారు.అడ్డతీగల మండలం నిమ్మలపాలెం గ్రామంలో ఆదివాసి భూమిని కబ్జా చేసి ఉన్నారని.ఆ భూమిని ఇప్పించాలని కోరడం జరిగింది. రాజవోమంగీ మండలం చిన్నయపాలెం గ్రామంలో గతంలో చాలామందికి సాగు భూములకు పట్టాలి ఇచ్చి ఉన్నారని. కానీ 30 కుటుంబాలకి పట్టాలు ఇంకా ఇవ్వలేదని వారు గత 50 సంవత్సరాల నుంచి జీడి తోటలు సాగు చేసుకుంటున్నారని. తక్షణమే ఆదివాసి కుటుంబాలకు పట్టాలు మంజూరు.చేయాలని కోరాటం జరిగింది. రంపచోడవరం మండలం దిరిసెనపల్లి గ్రామానికి చెందిన బల్లెం గంగాభవాని కుటుంబానికి వెలివేసిన సంఘటన పై వెలికి సంబంధించి కఠినమైన సెక్షన్ లు చేర్చలేదని దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.అలాగే పలు గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని దరఖాస్తు చేయడం జరిగినది.స్పందించిన జాయింట్ కలెక్టర్ తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ప్రకటన ద్వారా తెలియజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసి సమస్యల పరిష్కారమే ద్యేయంగా,ఏజెన్సీ చట్టాలు పరిరక్షణ కోసం, హక్కుల సాధన కోసం ఆదివాసి సంక్షేమ పరిషత్(274/16)రాజీలేని పోరాటం చేస్తుందని. భారత రాజ్యాంగం ఆదివాసులు కల్పించిన ఏజెన్సీ చట్టాలు పట్టిస్తా అమల కోసం ఏజెన్సీలో పనిచేస్తున్న అధికారులు,ఏజెన్సీలో ఎస్టీ రిజర్వేషన్‌తో గెలుపొందిన. ప్రజాప్రతినిధులు కృషిచేయాలని ఈ సందర్భంగా ఆదివారం సంక్షేమ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. ఏజెన్సీలోని అక్రమ కట్టడాలు తొలగించాలని,ప్రజలకి,పర్యావరణాలకి హాని చేస్తున్న మైనింగ్ లను నిలుపుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ అధ్యక్షులు మోడీద నూకరాజు, డివిజన్ ప్రధాన కార్యదర్శి చోడి ప్రదీప్ కుమార్ దొర, డివిజన్ కోఆర్డినేటర్ పీఠా ప్రసాద్, బల్లెం గంగాభవాని,పరదా శివరామకృష్ణ, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. మోడిద నూకరాజు ఆదివాసి సంక్షేమ పరిషత్ రంపచోడవరం డివిజన్ అధ్యక్షులు