కరాటేలో సత్తా చాటిన జడ్పిహెచ్ఎస్ రాయికల్ విద్యార్థినీలు

అభినందించిన హెచ్ఎం జయ మరియు కరాటే మాస్టర్ నరేందర్ నాయక్

పయనించే సూర్యుడు మార్చి 17 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం రాయికల్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థులు రతన్ టాటా జాతీయస్థాయి కరాటే పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచారు. షాద్నగర్ పట్టణంలోని రంగారాయ ఆడిటోరియంలో జరిగిన ఈ పోటీల్లో రాయికల్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన తనుకుమారి, రోజా మరియు మంజుల, తేజశ్రీ పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచారని కరాటే సీనియర్ మాస్టర్ నరేందర్ నాయక్ తెలిపారు . గెలుపొందిన విద్యార్థులకు సినీ హీరో రమాకాంత్ నాయక్ చేతుల మీదుగా బహుమతులను అందుకోవడం జరిగింది. గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల హెచ్ఎం జయ మరియు ఉపాధ్యాయులు విద్యార్థి తల్లిదండ్రులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ నరేందర్ నాయక్ మాస్టర్ పీరు నాయక్ మాస్టర్ వినయ్ పాల్గొన్నారు.