కరాటే ఛాంపియన్స్ లో స్టెల్లా మేరీ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

★ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థిని విద్యార్థులకు తప్పనిసరి ★ స్వీయ రక్షణ కోసం చాలా దోహదపడతాయి ★ కరాటే వల్ల మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది ★ స్టెల్లా మేరీ స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ సుమలత ★ బూర్గంపహాడ్ మార్చి 15 నవభూమి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 17,2026: ఏపీ, తెలంగాణ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ 2026 ఖమ్మం వినోద్ కరాటే అకాడమిలో జరిగిన పోటీల్లో స్టెల్లా మేరీస్ స్కూల్ మొరంపల్లి బంజర విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి 5 గోల్డ్ మెడల్స్, 6 సిల్వర్ మెడల్స్ సాధించారు. ఈ పోటీలను ఉద్దేశించి స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ సుమలత మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ చిన్న వయసులో ఉన్న వారికి ఆత్మవిశ్వాసం పెరిగేందుకు ఎంతగానో ఉపకరిస్తాయని వీటివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదేవిధంగా శరీరం మెదడు సరిగ్గా ఉండటం లో దోహదం చేస్తాయి. సాధారణంగా మార్చల్ ఆర్ట్స్ గా పిలవబడే ఈ కళ అత్యంత ప్రసిద్ధిగాంచిన క్రీడల్లో ఒకటిగా ఉంది. దీనిని నేర్చుకుంటే ఎవరికైనా హాని కలిగినప్పుడు లేదా స్వీయ రక్షణ కోసం లేదా ఎవరినైనా రక్షించడానికి సహాయపడుతుంది. అమ్మాయిలు అబ్బాయిలు ఆత్మ రక్షణ కోసం కరాటే వంటి క్రీడలు నేర్చుకుంటే భవిష్యత్తులో ఎంతో ఉపయోగం అంటూ విద్యార్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మా పాఠశాల విద్యార్థులు మెడల్స్ సాధించడం చాలా గర్వంగా ఉందని అన్నారు. మా స్కూల్లో విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా అత్యధిక ప్రతిభ కనపరచడం ఆనందం గా ఉందని అన్నారు. అదేవిధంగా మీ పిల్లలు కూడా ఇలాంటి మెడల్స్ సాధించాలంటే 2026 -27 అడ్మిషన్లు జరుగుతున్నవి కావున తల్లిదండ్రులు గమనించి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు మా స్కూల్ పునాది కానుంది అని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం స్టెల్లామేరి స్కూల్ ప్రిన్సిపల్ సుమలత.