కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ లతో గారడి చేసి ప్రజానీకానీ మోసం చేసింది

★ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ 1000 రోజులు దాటిన అమలు చేయలేని దౌర్భాగ్యస్థితిలో ఉంది ★ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేసిన కరీంనగర్ బిజెపి జోన్ నేతలు

పయనించే సూర్యుడు మార్చి 17 కరీంనగర్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీ లతో గారడి చేసి ప్రజానీకానీ మోసం చేసిందని, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ 1000 రోజులు దాటిన అమలు చేయలేని దుస్థితిలో ఉందని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కరీంనగర్ బిజెపి జోన్ నేతలు మండిపడ్డారు. 6 గ్యారంటీల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, గ్యారంటీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును నిర్వహిస్తూ సోమవారం రోజున కరీంనగర్ బిజెపి ఈస్ట్ , వెస్ట్ , సౌత్ , నార్త్ , సెంట్రల్ జోన్ ల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి , కరీంనగర్ ఎమ్మార్వో కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జోన్ అధ్యక్షులు జాడి బాల్ రెడ్డి, తణుకు సాయి కృష్ణ, పాదం శివరాజ్, బండారి గాయత్రి , అవదుర్తి శ్రీనివాస్ లు మాట్లాడుతూరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు , 420 హామీలు ఇప్పటివరకు పూర్తిగా అమలు చేయలేని దౌర్భాగ్యస్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల అందిస్తామన్న రూ.2500 , రూ.500 కు గ్యాస్ సిలిండర్ లను అటకెక్కించిందన్నారు. రైతు భరోసా కు భరోసా లేకుండా పోయిందన్నారు. రైతు రుణమాఫీ నీ సక్రమంగా అమలు చేయలేకపోయిందన్నారు . యువ వికాసాన్ని గాలికి వదిలేసిందన్నారు.చేయూతనిస్తామని పెన్షన్లకు చేయిచ్చిదన్నారు . ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల స్థలాలకు 5 లక్షల రూపాయలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గదాల స్థలాల అంశాలకు మంగళం పాడిందన్నారు. గృహజ్యోతి పథకాన్ని తూతూ మంత్రంగా అమలుచేసి చేతులు దులుపుకుందన్నారు. రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారెంటీ ల విషయంలో ప్రజానీకాన్ని తీవ్రంగా మోసం చేస్తుందని వారు మండి పడ్డారు. ఈప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారంటీల ను వెంటనే అమలు చేయాలని లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో తీవ్ర మైన ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. బీజేపీ సీనియర్ నాయకులు గుజ్జా శ్రీనివాస్ రావు, కార్పొరేటర్లు బండా రమణ రెడ్డి , ఒంటెల సత్యనారాయణ రెడ్డి , సోమిడి వేణు, మేకల వెంకటేష్ , మాసం గణేష్ , అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లు వరాల జ్యోతి, బండి ప్రశాంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నాంపల్లి శ్రీనివాస్, దేవసాని సత్యం, పొన్నం మొండయ్య, పెద్దపల్లి జితేందర్, రాగి సత్యనారాయణ, కడర్ల విమల్ కుమార్, అన్నాజీ వినీత్ కుమార్, ఉప్పరపల్లి శ్రీనివాస్, మంగళ రవిగోపాల్, దెయ్యాల మల్లేశం, విష్ణు ప్రసాద్ రావు, కేశవ రెడ్డి, పాశం తిరుపతి, పరుశురాములు తదితరులు పాల్గొన్నారు.