కోరుట్ల పట్టణానికే తలమానికం ‘గడి గురుజులు ‘

★ భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేయాలి ★ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కార్యాలయం కు 28వ వార్డు కౌన్సిలర్ కొక్కెర వెంకటేష్ విన్నపం.

పయనించే సూర్యుడు, కోరుట్ల, మార్చి 17 కోరుట్ల పట్టణంలోని 28వ వార్డులో గల చారిత్రక కట్టడం "గడి గురుజుల" వద్ద భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేయాలని ఆ వార్డు కౌన్సిలర్ కొక్కెర వెంకటేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మున్సిపల్ కమిషనర్‌ కార్యాలయంకు, మరియు మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి తిరుమల వసంత గంగాధర్, వైస్ చైర్మన్ మహ్మద్ షాహిద్ ని కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఇటీవల మున్సిపల్ సాధారణ సమావేశంలో పట్టణ గౌరవార్థం ఒక చోట అత్యంత ఎత్తైన జాతీయ జెండాను ఏర్పాటు చేయాలని ఎజెండాలోని 20వ అంశంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఆ జెండాను ఏర్పాటు చేయడానికి గడి గురుజుల ప్రాంతమే అత్యంత అనువైనదని వెంకటేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "కోరుట్ల పట్టణ చరిత్రలో గడి గురుజులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పటికే ఈ కట్టడం జాతీయ జెండా రంగులతో అలరారుతూ ప్రజలను ఆకట్టుకుంటోంది. ఇక్కడ హై మాస్ట్ ఫ్లాగ్ ఏర్పాటు చేయడం వల్ల ఆ చారిత్రక కట్టడానికి మరింత శోభ రావడమే కాకుండా, పట్టణానికి వచ్చే పర్యాటకులకు మరియు ప్రజలకు ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మున్సిపల్ పాలక వర్గం మరియు అధికారులు సానుకూలంగా స్పందించి, వెంటనే పనులు ప్రారంభించాలని కోరుతున్నారు.