పయనించే సూర్యుడు మార్చి 17 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం : రాత్రి వేళల్లో వాహన ప్రయాణం అంటేనే ఒక సవాలుగా మారుతోంది. రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాల ‘హై-బీమ్’ వెలుతురు సామాన్య వాహనదారుల ప్రాణాల మీదకు తెస్తోంది.అవసరం ఉన్నా లేకపోయినా హై-బీమ్ లైట్లు వాడుతూ ఎదుటివారి కళ్లు మిరుమిట్లు గొలిపి, ప్రమాదాలకు కారణమవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది, ముఖ్యంగా ఖమ్మం నుండి భద్రాచలం వైపు వెళ్లే రహదారిలో చుట్టు పక్కల ప్రాంతాల్లో రోడ్లమీద వాహనాలు నడపాలంటేనే వణుకు పుడుతుంది,వాహనాలకు అమర్చిన హై పవర్ ఎల్ ఈ డి లైట్ల వలన ఎదురుగా వచ్చే వాహనాలకు దారి కనిపించక రోడ్డు ప్రమాదాలు జరగడమే కాకుండా అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా బైపాస్ రోడ్డు ప్రధాన రహదారుల ప్రాంతాల్లో ప్రయాణించే వాహన చోదకుల పరిస్థితి దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షులా తయారయింది, అడిగే వాడు ఎవడు లేడు,అంతా మా ఇష్టం అనే రీతిలో కొందరు వాహనాలకు హై పవర్ ఎల్ ఈ డి లైట్స్ అమర్చి ఖమ్మం రోడ్లమీద విచ్చలవిడిగా స్వైరవిహారం చేస్తున్నారు ఏమిటీ అంధత్వం? ఒక వాహనం హై-బీమ్ లైట్లతో ఎదురుగా వచ్చినప్పుడు, ఆ వెలుతురు తీవ్రత వల్ల అవతలి డ్రైవర్ కళ్లు కొన్ని సెకన్ల పాటు ఏమీ కనిపించని స్థితికి చేరుకుంటాయి. దీనిని ‘గ్లేర్’ అంటారు. సెకనుకు 60-80 కిలోమీటర్ల వేగంతో వెళ్లే వాహనం, ఆ మూడు సెకన్ల అంధత్వంలో దాదాపు 50 నుండి 70 మీటర్ల దూరం ప్రయాణిస్తుంది.ఆ సమయంలో రోడ్డుపై ఉన్న మలుపులు,డివైడర్లు లేదా పాదచారులు అస్సలు కనిపించరు,ఇదే ఘోర ప్రమాదాలకు దారితీస్తోంది,ఒక విధంగా చెప్పాలంటే బారీ వాహనాల నుండి మొదలు పెట్టీ కార్లు, ఆటోలు చివరకు ద్విచక్ర వాహనాలకు కూడా ప్రత్యేకమైన సెటప్ ఏర్పాటు చేసి లైట్స్ అమర్చడం విశేషం, అంతే కాకుండా ఒక్కో వాహనానికి హై పవర్ లైట్స్ అమర్చడం కోసం లక్షల్లో ఖర్చు చేస్తున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు,ఇది వాహనదారుల నిర్లక్ష్యమో,అధికారుల అలసత్వమో తెలియదు కానీ వీరి నిర్లక్ష్య వైఖరి వలన నిండు ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి,ఎన్నో కుటుంబాలు అనాథలుగా మారుతున్నాయి ఖమ్మంనగరంలో నిబంధనలు బేఖాతరు మోటార్ వాహనాల చట్టం ప్రకారం, వీధి దీపాలు ఉన్న నగరాలు మరియు పట్టణ ప్రాంతాల్లో హై-బీమ్ వాడటం నిషేధం,కేవలం వెలుతురు లేని హైవేలపై మాత్రమే వీటిని వాడాలి. కానీ, నేడు నగరాల్లో కూడా డ్రైవర్లు అజాగ్రత్తగా హై-బీమ్ వాడుతూ ఎదుటివారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు,ఈ విధంగా వాహనాలకు అడ్డగోలుగా హై పవర్ ఎల్ఈడి లైట్స్ అమర్చుతున్న అంశంలో ఖమ్మం రోడ్ రవాణా అధికారి నియంత్రణ లేదని ప్రజలు భావిస్తున్నారు, తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ నిబంధనల ప్రకారం గతంతో వాహనా చోదకుల వాహనాల హెడ్‌లైట్‌కు సగం వరకు బ్లాక్ పెయింట్ కానీ, బ్లాక్ స్టిక్కర్ కానీ వేస్తే కానీ వాహనాలకు అనుమతినిచ్చేవారు కాదు కానీ ఇప్పుడు ఆ రూల్ తీసేసారో ఏమో తెలీదుగానీ వాహనాలకు అడ్డగోలుగా హై పవర్ లైట్స్ అమర్చుకుని తిరుగుతున్న పట్టించుకునే నాథుడు లేడని ప్రజలు వాపోతున్నారు, ఖమ్మంలో అసలు ఆర్టీవో శాఖ అనేది ఉందా..? అసలు అది పని చేస్తుందా.. ? ఈ లైట్లు ఎంటీ..ఈ వాహనాలు ఎంటీ..? రోడ్డ మీద రాత్రి వాహనాలు నడపాలంటే భయమేస్తోందని వాహనాల చోదకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత ఆర్టీవో,ట్రాపిక్ పోలీసు అధికారులు వాహనాల హెడ్ లైట్లకు హై పవర్ ఎల్ఈడీ లైట్లు అమర్చుతున్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకొని కనీసం హెడ్ లైట్లకు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ కానీ, బ్లాక్ పెయింట్ కానీ వేయాలనే రూల్‌ను పునరుద్దరించాలని వాహనాల చోదకులు కోరుతున్నారు,ఈ సందర్భం వాహన చోదకులకు ఒక విన్నపం చేస్తుంది,మీ వాహనం లైట్లు మీకు దారి చూపాలి, కానీ ఎదుటివారి ప్రాణాలను తీయకూడదు. రాత్రి వేళల్లో బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయండి. హై-బీమ్ వాడకాన్ని తగ్గించండి, రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వాములు అవ్వండి