గుత్తి లో ఘనంగా అమర జీవి పొట్టి శ్రీరాములు వేడుకలు

పయనించే సూర్యుడు: మార్చి 17 అనంతపురం జిల్లా గుత్తి మండలం రిపోర్టర్: బి నిజాముద్దీన్ వార్తా విశ్లేషణ: అమర జీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి గుత్తి పట్టణంలో ఆర్ఎస్ రోడ్ లోని శ్రీ సాయి క్యాంపస్ నందు శ్రీ సాయి క్యాంపస్ సీఈవో ఏ. శ్రీరాములు, శ్రీ సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు రెడ్డి, పి ఆర్ ఆర్ ఎం బి ఏ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడం జరిగినది. అదేవిధంగా గుత్తి పెన్షన్ భవనంలో పెన్షనర్స్ అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించడం జరిగినది. పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేసి ,ప్రాణాలర్పించి ,అమరజీవి యైన మహా పురుషుడు. వీరు ఉప్పు సత్యాగ్రహం ,క్విట్ ఇండియా ఉద్యామాలలో పాల్గొనడం వల్ల మూడు సార్లు జైలు శిక్ష అనుభవించాడు అని తెలపడం జరిగినది