పయనించే సూర్యుడు, మార్చి 17 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) ఐటీ కంపెనీలలో పనిచేసే యువత కి హాస్టల్ లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ల కొరత తో తీవ్ర ఇబ్బందులకి గురి అవుతున్నారు. ప్రైవేట్ హోటల్ లు సైతం గ్యాస్ సిలిండర్ దెబ్బ తో విలవిల లాడుతున్నాయి. ఇప్పటికే పౌరసరఫ రాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 20 శాతం మాత్రమే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ అందుబా టులో ఉందని తేల్చి చెప్పడంతో హాస్టల్, హోటల్ నిర్వాహ కులు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తూ వంటల కార్యక్రమాలు నిర్వహిస్తున్నా రు.కట్టెల పొయ్యి అందరి కీ ఆశించిన స్థాయిలో వసతులు లేకపోవ డంతో కొందరు నిర్వా హకులు మూసి వేస్తూ నిర్ణయం తీసుకు న్నారు.బ్లాక్ లో కమర్షియల్ సిలిండర్ ధర బ్లాక్ మార్కెట్ లో రూ 8000/- వరకు చేరిందని దానినీ అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా ఎన్. జి.ఓ కో కన్వీనర్ దేవరకొండ బాలకృష్ణ స్పష్టం చేశారు. సమస్యను అధిగమించే చర్యలు తీసు కోవాలని కేంద్ర ప్రభుత్వంకి రాష్ట్ర ప్రభు త్వం విన్నవించి సమస్య పరిష్కారం చేసి హాస్టల్,హోటల్ నిర్వా హకులకి ఊరట కలిగించాలని ఆయన తెలిపారు.