జిల్లా కలెక్టరేట్ వద్ద రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటుకు వినతి పత్రం అందజేత.

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు బావాండ్ల వెంకటేష్.

పయనించే సూర్యుడు మార్చి 17 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తా దగ్గర గల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం (ఐ.డి.ఓ.సి) ముందు అన్ని రకాల బస్సులు ఆపాలని నాగర్ కర్నూలు ఆర్టీసీ డిపో మేనేజర్ యాదయ్యకు సోమవారం నాడు తెలంగాణ నాన్ గజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు భావాండ్ల వెంకటేష్, జిల్లా కార్యదర్శి షర్ఫుద్దీన్ వినతీ పత్రమును అందజేశారు. ప్రతిరోజు 500 మంది ఉద్యోగస్తులు వివిధ ప్రాంతాలలోని ఇంటివద్ద నుండి వ్యక్తిగత వాహనాలు లేక ఆర్టీసీ బస్సులో ప్రయాణించి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణకు చేరుకుంటారని, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయలలో వారి పనుల నిమిత్తం 1500 మంది ప్రజలు, మహిళలు వస్తూ ఉంటారని,కలెక్టరేట్ కార్యాలయం వద్ద ప్రజా సౌకర్యార్థం రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో టిఎన్జీవో యూనియన్ జిల్లా కోశాధికారి బాలరాజు, నాయకులు సురేష్, చెన్నకేశవులు,రహీంఅహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *