జై జవాన్ కాలనీ మసీదులో రంజాన్ తోఫా పంపిణీ

★ మసీదుకు ప్రత్యేకంగా రంజాన్ తోఫా మంజూరయ్యేలా కృషి ★ ⁠కాంగ్రెస్ పార్టీ ఏఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షులు కేశెట్టి ప్రసాద్

పయనించే సూర్యడు / మార్చ్ 17/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని జై జవాన్ కాలనీలో గల 'మజీద్ ఈ నూర్ ఈ ఇల్లాహి' మసీదులో సోమవారం రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ కానుకలను అందజేసేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షులు కేశెట్టి ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశెట్టి ప్రసాద్ మాట్లాడుతూ.. సాధారణంగా డివిజన్‌కు ఒక మసీదుకు మాత్రమే తోఫా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, జై జవాన్ కాలనీ మసీదుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మైనారిటీ చైర్మన్ ను స్వయంగా కలిసి, కాలనీ మసీదుకు ప్రత్యేకంగా రంజాన్ తోఫా మంజూరయ్యేలా కృషి చేశామన్నారు. పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనమని, ముస్లిం సోదరులందరూ సుఖసంతోషాలతో పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ పంపిణీ చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త అంజి రెడ్డి, పాకల రాజన్న, పెద్ది నాగరాజు, పెద్ది శ్రీనివాస్, అల్లూరయ్య, తళ్లపల్లి మేగరాజు, స్టేట్ ఓబీసీ కన్వీనర్ పాతకోటి రామలింగ, ఎస్సీ సెల్ అధ్యక్షులు తాడూరి అనిల్ కుమార్, భద్ర గమ నరసింహ, సింగం కిరణ్, తాళ్లపల్లి సందీప్ గౌడ్, కోళ విజయేందర్, రాణి, పద్మ, మసీదు అధ్యక్షులు ఎస్ఎం సాహెబ్, సలీం, సత్తార్, పీరా రావు, ఉపేందర్ రెడ్డి, దస్తగిరి, ఏవీ రెడ్డి, యాదగిరిరెడ్డి మరియు కాలనీ ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.