పయనించే సూర్యుడు ,మార్చి 17,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భూర్గంపాడు మండలం, సారపాకకు చెందిన పరశురాం పరివార్ హిందూ సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ముత్తవరపు రాజశేఖర్ కు బెస్ట్ సర్వీసు సొసైటీ నేషనల్ అవార్డు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో జరిగిన సౌత్ ఇండియా బహుజన రైటర్స్ 18వ నేషనల్ కాన్ఫరెన్స్ బహుజన సాహిత్య అకాడమీ (బియస్ఏ) జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ యు.సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ముత్తవరపు రాజశేఖర్ చేస్తున్నా సేవలకు గాను బెస్ట్ సర్వీసు సొసైటీ నేషనల్ అవార్డును అందజేయడం జరిగినది . ఈ సందర్భంగా ఆఆయ మాట్లాడుతూ గత ఫిబ్రవరి లో మేము చేస్తున్న సేవలకు గాను మొదటి అవార్డు హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీసు వారి నుండి సేవారత్న అవార్డు పొందాను, ఇప్పుడు రెండో అవార్డు బెస్ట్ సర్వీసు సొసైటీ నేషనల్ అవార్డు ను బహుజన సాహిత్య అకాడమీ వారి చేతుల మీదుగా తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, ఎనిమిది సంవత్సరాలుగా మేము చేస్తున్న సేవలను గుర్తించి అవార్డు ప్రధానం చేసిన బహుజన సాహిత్య అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తు లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాము అని, అందరికీ ఆదర్శంగా నిలుస్తాము అని తెలియజేశారు