నగరపాలక సంస్థ ప్రజావాణీ ప్రాధాన్యతగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని

నగర మేయర్ కొలగాని శ్రీనివాస్

పయనించే సూర్యుడు మార్చి 17 కరీంనగర్ న్యూస్: సోమవారం రోజు కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణీ కార్యక్రమం లో మేయర్, కమీషనర్ ప్రజలను దరఖాస్తులను స్వీకరించారు. విభాగాల వారిగా మొత్తం 24 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇంజనీరింగ్ విభాగంకు సంబంధించి 3, టౌన్ ప్లానింగ్ 12, ఇందిరమ్మ 1, సానిటేషన్ 2, రెవెన్యూ 6 చొప్పున మొత్తం 24 దరఖాస్తులు రావడం జరిగింది. దరఖాస్తుల పరిష్కారం సంబంధించి సెక్షన్ల వారిగా అధికారులకు మేయర్, కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రజావాణీ లో వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్తాయిలో విచారించి సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. దరఖాస్తులను పెండింగ్ లేకుండా చూడి ప్రజలకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రజావాణీ లో సెక్షన్ల వారిగా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *