నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేసిన బైక్ మెకానిక్ సాదిక్

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 17,2026: గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ ఎమ్మిగనూరు పట్టణంలో రంజాన్ పండుగ సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన బైక్ మెకానిక్ సాదిక్ నిరుపేద ముస్లిం కుటుంబాలకు దాదాపు 200 మందికి రంజాన్ తోఫా కిట్లు, బెడ్ షీట్లు పంపిణీ చేశారు. అనంతరం సాదిక్ మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో నిరుపేద కుటుంబంలో ఉన్న ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరు పవిత్రమైన రంజాన్ పండుగను జరుపుకోవాలని మహా ప్రవక్త అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం గారి చెప్పిన పద్ధతులను ప్రతి ఒక్కరూ అల్లా మార్గంలో పాటించాలన్నారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా ఎందరో పేదవారికి తన మానవత దృక్పథంతో సేవాగుణంలో ముందుండి సేవలందించాలన్నారు. ఎవరైనా నిరుపేదలు ఉంటే వారికి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *