నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 17 అనంతపురం జిల్లా, యాడికి: ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసంను పురస్కరించుకుని యాడికి మండల కేంద్రంలోని ముస్లిం సహారా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం రంజాన్ తోపా ను 50వేల రూపాయలు విలువగల 50 కుటుంబాల నిరుపేద ముస్లిం లకు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ.. త్యాగానికి ప్రతీక రంజాన్ అని, రంజాన్ ను పురస్కరించుకుని పేదలకు తోఫాను ఇస్తున్న ముస్లిం సహారా ఫౌండేషన్ సభ్యులను పలువురు అభినందించారు. ప్రతి ఒక్కరు సోదర భావంతో పండుగ జరుపుకునే విధంగా తోఫా పంపిణీ చేయడం హర్షణీయమని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ మెకానిక్ హాజీవలి, వేములపాడు మహబూబ్ బాషా, పోస్ట్ మ్యాన్ మహబూబ్ బాషా, మస్తాన్, టైలర్ చాంద్ బాషా, మెకానిక్ ఖాదర్, డ్రైవర్ భాష తదితరులు పాల్గొన్నారు.