పాలెం రాంనగర్ కాలనీ అభివృద్ధికి మరో అడుగు.. సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

పయనించే సూర్యుడు మార్చి 17 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని రాంనగర్ కాలనీలో సోమవారం నూతన సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా కాలనీలో సీసీ రోడ్లు లేకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన స్థానిక నాయకులు కాలనీ వాసుల సౌకర్యార్థం సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. దీంతో రాంనగర్ కాలనీలో సీసీ రోడ్ల సమస్యకు పరిష్కారం దొరకడంతో కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోవింద్ రామకృష్ణ, యువజన కాంగ్రెస్ నాయకులు జయకృష్ణ గౌడ్, మాజీ సర్పంచ్ బుర్రి యాదవ రెడ్డి, గంగు కృష్ణవేణి, మడ్డి బలరాం గౌడ్, 3వ వార్డ్ మెంబర్ పరుష రాములు, కురుమయ్య, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.