
పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 17.03.2026 మదనపల్లి అన్నమయ్య నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ) పుంగనూరు నియోజకవర్గంలో ప్రతి వారం సోమవారం నిర్వహించే జనవాణి కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సీరివేలు గంగాధర్ (చిన్నా) , జనసేన పార్టీ మరియు కూటమి ముఖ్య నాయకులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సదుం మండలానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి తన స్థలాన్ని వైసీపీ నాయకులు అక్రమంగా కబ్జా చేసినట్లు జనవాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానానికి తెలియజేసి న్యాయం చేయాలని ఆయన కోరారు. దీనిపై స్పందించిన ఇన్‌ఛార్జ్ సీరివేలు గంగాధర్ (చిన్నా) వెంటనే స్థానిక రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ మరియు కూటమి నాయకులు అండగా ఉంటారని తెలిపారు. ఇక జనసేన పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి మాట్లాడుతూ, గత నెల 26వ తేదీ నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన పొందిందన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఎక్కువ మంది ప్రజలు పాల్గొనేలా పొడిగించామని, రేపు అనగా 17-03-2026 తేదీతో ఈ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగియనున్నది అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 15 లక్షలకు పైగా ఉద్యమి సభ్యత్వాలు నమోదు కావడం జనసేన పార్టీకి ప్రజల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే పుంగనూరు నియోజకవర్గంలో ఇప్పటికే 8000 పైచిలుకు ఉద్యమి సభ్యత్వాలు నమోదు కావడం పార్టీ కార్యకర్తల కృషి మరియు ప్రజల మద్దతుకు ఉదాహరణ అని చెప్పారు. ఈ సందర్భంగా ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు కష్టపడి పనిచేస్తున్న పార్టీ సాధక్‌లకు, నాయకులకు మరియు కార్యకర్తలకు సీరివేలు గంగాధర్ (చిన్నా) ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రేపటితో కార్యక్రమం ముగియనున్న నేపథ్యంలో ఇంకా సభ్యత్వం పొందని వారు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకొని జనసేన ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఎప్పటికీ ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తుందని, ప్రజలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గాజుల నరేష్ ఉపాధ్యక్షులు నందు, పట్టణ నాయకులు భార్గవ్, గోపి, ఎన్ఎస్ పేట నాయకుడు సుబ్రమణ్యం (పండు) నాయకులు పాల్గొన్నారు. – జనసేన పార్టీ పుంగనూరు నియోజకవర్గం