పెద్దకడబూరులో కలుషిత తాగునీరు – కాంట్రాక్టర్, ఏఈపై చర్యలు డిమాండ్

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 17 రిపోర్టర్ అభి పెద్దకడబూరు మండలంలోని ఎస్సీ కాలనీకి కలుషిత నీరు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌తో పాటు ఆర్డబ్ల్యూఎస్ ఏఈపై తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రాలయం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తిక్కన్న కార్తికేయ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఎంపీడీఓ ప్రభావతికి ఆయన ఫిర్యాదు చేశారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి ఫిల్టర్ చేయని నీటిని కాలనీలో సరఫరా చేస్తున్నారని, దీంతో స్థానికులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సమస్యను పరిశీలించి శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేయడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. సమస్య పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *