పయనించే సూర్యుడు మార్చి 17 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు మాట్లాడే వారందరికీ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలంటూ కీ,శే,,పొట్టి శ్రీరాములు అక్టోబరు 19, 1952న మద్రాసులో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి 58 రోజుల పాటు దీక్షను కొనసాగించి 1952 డిసెంబరు 15న ఆయన తన తుదిశ్వాస విడిచారు.ఆయన పొరాటానికి ఫలితంగా నవంబర్ 1, 1956న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ రోజు అమరజీవి కీ,శే,,పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ శ్రీమతి డాక్టర్ ఏ.సిరి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యలయం నందు జరిగిన కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ, డి.సి.ఎం.ఎస్ చైర్మన్ వై.నాగేశ్వర రావు యాదవ్, రాష్ట్ర బొందిలి కార్పోరేషన్ చైర్మన్ విక్రం సింగ్, తెలుగుదేశంపార్టీ ముఖ్య నాయకులు కె.వి.సుబ్బా రెడ్డి, రాష్ట్ర ఉప్పర కార్పోరేషన్ డైరెక్టర్ ఎల్.వి.ప్రసాద్, రాష్ట్ర బేస్త కార్పోరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు సోమిశెట్టి శ్రీకాంత్ హాజరు కావడమైనది.
