ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక ప్రజలకు ఎంతో మేలు సంస్కృతిక సారధి జిల్లా అధ్యక్షులు పాలకుర్తి శ్రీకాంత్

పయనించే సూర్యడు మార్చి 17 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు నడిగూడెం మండలం మండల కేంద్రంలో సోమవారం నాడు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ ప్రవేశపెట్టింది ఈ కార్యక్రమం పది వారాలపాటు గ్రామ అవార్డు సభలు నిర్వహించి పరిసరాల పరిశుభ్రత గంజాయి డ్రగ్స్ నిర్మూలన ప్రజా సమస్యలు తెలుసుకొని పరస్కరించుకోవడం కోసం వారానికి ప్రత్యేక విభాగం కార్యక్రమాలపై వారోత్సవాలను ప్రభుత్వం చేపట్టింది సాంస్కృతిక సారధి జిల్లా అధ్యక్షులు పాలకుర్తి శ్రీకాంత్. టీం లీడర్ పల్లెల లక్ష్మణ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లెల రాము తెలియజేశారు ఈ కార్యక్రమంలో 99 రోజులో సర్పంచి నుంచి ఎమ్మెల్యే ఎంపీ వరకు ప్రజా ప్రతినిధులు అందరిని భాగస్వామ్యం మండల పట్టణ నియోజకవర్గ కేంద్రాలలో వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ అమలు కార్యక్రమాలను వివరించనుంది ఈ కార్యక్రమంలో సంస్కృతిక సారధి జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి శ్రీకాంత్. గ్రామ సర్పంచ్ దున్న శ్రీనివాసులు. గ్రామ కార్యదర్శి . జిల్లా టీం లీడర్ పల్లెల లక్ష్మణ్. జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లెల రాము. గంట బిక్షపతి. గడ్డం ఉదయ్. పాక ఉపేందర్. మాజీ శంకర్. మద్దిరాల మంజుల. కుందమల్ల నాగలక్ష్మి. ములకలపల్లి మల్లమ్మ. సిరిపంగి రాధ.గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు…