ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన ఆర్థిక భరోసా

పయనించే సూర్యుడు మార్చి 17 (సూళ్లూరుపేట నియోజకవర్గo రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా తడ మండలం పెరియవట్టు గ్రామంలో జె.బిరుగునాథ్ రాయ్ ఆరోగ్యం సరిలేనందున మరణించడం జరిగింది.ఈయన గురించి బ్యాంక్ లో విచారించగా ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన(పిఎంజెజెబివై) యాక్టివ్ లో ఉంది. దీనికిగాను మేము బ్యాంకు లో క్లెయిమ్ చేశాము.పీఎంజెజెబివై ద్వారా రూ.2 లక్షలు రూపాయలు అమౌంట్ సెటిల్మెంట్ అయ్యింది. ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన(పిఎంజెజెబివై) ద్వారా రూ. 2 లక్షల రూపాయలు ఆయన భార్య శ్రీ కుమారి దేవి కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ యువరాజ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన మరియు ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన అందరూ చేసుకోవాలని భవిష్యత్తులో జరిగే అకాల సంఘటనలకు మీ కుటుంబాలకి చేయూత కలిగే విధంగా భరోసా కల్పిస్తుంది అని తెలియ చేయడం జరిగింది. పై కార్యక్రమంలో కెనరా బ్యాంక్ మేనేజర్ యువరాజ్,శేఖర్, ఫీల్డ్ ఆఫీసర్ ప్రశాంత్ పండిత్, వెంకటేశ్ వెలుగు ఏపిఎం రాజా రెడ్డి, సీసీ మురళీ మరియు సూళ్లూరుపేట ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్స్ ముని చంద్ర, పరమానందం మరియు వివోఎ తిలక పాల్గొనడం జగిరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *