ప్రమాదం జరిగిన వ్యక్తికి ఆర్థిక సాయం చేసిన జుత్తుల శ్రీను

పయనించే సూర్యుడు న్యూస్,మార్చి17 (ఏలేశ్వరంమండల రిపోర్టర్ ఏ శివాజీ):పట్టణంలో క్వారిపేట కాలనీలో ఇటీవల తిమ్మరాజు చెరువు వద్ద ప్రమాదానికి గురైన పంగర్తి విజయ్ కు 20వ వార్డు టిడిపి నాయకులు జుత్తుల శ్రీను,సభ్యులు ఆర్థిక సాయం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిడిపి యువ నాయకులు బోదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి ఆదేశాల మేరకు గాయపడిన విజయ్ కు నిత్యవసర వస్తువులు,కూరగాయలు ఇవ్వడం జరిగిందన్నారు.అలాగే సాయం చేసే దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో బత్తులు నాగేశ్వరరావు, పెండ్యాల రాజు,వాతాడ డేవిడ్ రాజ్, నల్లమాటి పండు,లాజర్,బుజ్జిబాబు, తదితరులు పాల్గొన్నారు.