పయనించే సూర్యుడుమేజర్ న్యూస్ మార్చి 17.03.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి మండలంలోని విజయ వాణి నగర్ చౌడేపల్లి పట్టణంలోని ఉన్నత పాఠశాలలో రెండు కేంద్రాలందు విద్యార్థులకు పది పరీక్షల నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు రెండు కేంద్రాలు కలిపి 557 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా ముగ్గురు హాజరు కాలేదని ఎంఈఓ కేశవరెడ్డి తెలిపారు ఆయా పరీక్ష కేంద్రాల వద్దకు ఉదయాన్నే విద్యార్థులు వారి తల్లిదండ్రులు చేరుకున్నారు ప్రభుత్వం మేరకు ప్రతి కేంద్రం ముందు విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించినట్లు ఆయన వివరించారు కాగా పరీక్షా కేంద్రాల వద్దకు సకాలంలో ఆర్టీసీ సేవలు లేనందున పలువురు ఇబ్బందులు పడ్డారు పరీక్ష సమయంలోనైనా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు
