ప్రేమ, శాంతి, సహనం, సోదరభావానికి ప్రతీకగా రంజాన్ మాసం దళిత బహుజన ఫ్రంట్ నేషనల్ కో ఆర్డినేటర్ టి.చంగల్ రావు

పయనించే సూర్యుడు మార్చి 17, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ బి వి బి కాకినాడలో దళిత బహుజన ఫ్రంట్ జిల్లా కార్యవర్గ సభ్యులు సలిమా అక్తర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దళిత బహుజన ఫ్రంట్ నేషనల్ కోఆర్డినేటర్ టి చంగల్ రావు హాజరయ్యారు. ముస్లిం సోదరులు నెల రోజుల పాటు కఠిన ఉపవాసాలు పాటిస్తూ భక్తి, నియమ నిష్ఠలతో ప్రార్థనలు చేయడం గొప్ప సంప్రదాయమని చంగల్ రావు పేర్కొన్నారు. గత 20సంవత్సరాలుగా రంజాన్ ఆచరిస్తున్న ప్రతి ఒక్కరికి ఉపవాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *