పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరీకాలని -17 2025-26 ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా కొద్దిరోజులు మాత్రమే ఉన్నాయని అకౌంటింగ్ పరంగా పెండింగ్ ఉన్న బిల్లు లను త్వరితగతిన పూర్తిచేయాలని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు లు అన్నారు.సోమవారం జిఎం కార్యాలయం నందు నిర్వహించిన సమీక్ష సమావేశానికి రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు లు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.డిజిఎం ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సీ.జే.సురేఖ, అకౌంట్స్ పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలను, పెండింగ్ లో ఉన్న బిల్లులు, చేయవలసిన పనులను వివిధ గనుల, విభాగాల అధిపతులకు , అధికారులకు, ఉద్యోగులకు వివరించారు. ఈ సందర్భంగా జిఎంలు మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ముగియడానికి కొద్దిరోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని అకౌంట్స్, రికవరీలు, మొదలగునవి సరిచూసుకొని పెండింగ్ లేకుండా పూర్తిచేయాలని, వివిధ గనుల, విభాగాల నుండి పంపించవలసిన బిల్లులను, సమాచారాన్ని త్వరగా పంపించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్వోటుజిఎం బండి సత్య నారాయణ, ఏరియా ఇంజినీర్ సుధాకర్ రెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రవీణ్ వి ఫాంటింగ్, విభాగాధిపతులు కాశీవిశ్వేశ్వర రావు, సివిల్ డీజీఎం రాజేంద్ర కుమార్, జనార్దన్ రెడ్డి, సుదర్శనం, ఐలయ్య , షబ్బీరుద్దీన్, ఉదయ్ భాస్కర్, చంద్ర శేఖర్, పాపయ్య తో పాటు ఇతర వివిధ గనుల, విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.