బెటర్ ఫౌండేషన్ ద్వారా వివిధ గ్రామాల నుండి వచ్చే ప్రజలకు వేసవి కాలంలో దప్పికతో ఇబ్బందులు పడొద్దని ప్రజలకు చల్లని సురక్షిత మినరల్ త్రాగు నీరు ప్రతి ఏటా బస్టాండ్ ఆవరణలో 16. వ సంవత్సరాలనుండి చలివేంద్రం పెట్టి జలప్రసాదం.

పయనించే సూర్యుడు న్యూస్:మార్చి/17: నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం: రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కేంద్రంలో చలి వేంద్రం ప్రారంభోత్సవం చేసిన బెంద్రం.తిరుపతి రెడ్డి, ఇల్లంతకుంట మండల బస్టాండ్ పక్కన బెటర్ ఫౌండషన్ ఆధ్వర్యంలో ప్రజలకు చల్లని త్రాగు నీరు అందించే చలివేంద్రం ప్రారంభోత్సవం చేస్తూ బెంద్రం. తిరుపతి రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాట్లాడాతూ.. ఇల్లంతకుంట మండలానికి వివిధ గ్రామాల నుండి వచ్చే ప్రజలకు వేసవి కాలంలో దప్పికతో ఇబ్బందులు పడొద్దని ప్రజలకు చల్లని సురక్షిత మినరల్ త్రాగు నీరు ప్రతి ఏటా బస్టాండ్ ఆవరణలో 16. వ సంవత్సరాలనుండి చలివేంద్రం పెట్టి జలప్రసాదం అందిచటం చాలా సంతోషంగా ఉందన్నారు, నా ప్రజలకు ఎల్లపుడు బెటర్ ఫౌండేషన్ సేవలాందిస్తూనే ఉంటుందన్నారు. ఈ జల సేవా కార్యక్రమంలో బొల్లారం ప్రసన్న కుమార్, ఎర్రోజు సంతోష్, సాదుల నిరంజన్, బోయిని రంజిత్, బొల్లం రాంసాగర్, గజ్జల శ్రీనివాస్, అంతగిరి అనిల్, ఎల్లేంకి శ్రీనివాస్, పయ్యావుల నవీన్, సందవేని శేఖర్, కట్నపెల్లి రవీందర్ రెడ్డి, భూమల్ల ప్రశాంత్ , అంతగితి సురేష్, బొంగొని శ్రీనివాస్, జక్కుల శ్రీనివాస్, గుంటి మహేష్ , అకుల రాజమల్లు, రమణారెడ్డి, వేణు రమేష్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.