బోధన్‌లో హనుమాన్ దీక్షధారులకు బిక్ష కార్యక్రమం

పాప నాగమ్మ గుడి వద్ద పూజలు నిర్వహిస్తున్న స్వాములు పట్టణ రైతులు

పయనించే సూర్యుడు న్యూస్ 17 బోధన్: బోధన్ పట్టణంలోని బెల్లాల్ కట్టపై పాపనాగమ్మ గుడి సమీపంలో హనుమాన్ దీక్షలో ఉన్న భక్తులకు బిక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్షధారులు పెద్ద సంఖ్యలో పాల్గొని బిక్ష స్వీకరించారు.ఈ సందర్భంగా స్థానిక రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భక్తులకు బిక్ష అందించారు. కార్యక్రమంలో స్వాములు, భక్తులు మరియు స్థానికులు పాల్గొని సేవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.హనుమాన్ దీక్షలో ఉన్న భక్తులకు భోజన ఏర్పాట్లు చేసి ఆత్మీయంగా స్వాగతం పలికారు. భక్తులకు సేవ చేయడం గొప్ప పుణ్యకార్యమని పట్టణ వాసులు అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్ష స్వాములు పట్టణ వాసులు రైతులు తదితరులు పాల్గొన్నారు