పయనించేసూర్యుడు న్యూస్ మార్చి17ఆదోనిడివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి ఆదోని జిల్లా తోనే కర్నూలు పశ్చిమ ప్రాంతం సమగ్ర అభివృద్ధి జరుగుతుంది.రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, మహిళా సంఘాల నాయకులు ఐక్యమత్యంతో చేస్తున్నటువంటి ఈ ఉద్యమంలో అధికారపక్షము, ప్రతిపక్షము ఆదోని జిల్లా ఉద్యమాన్ని నిర్వార్యం చేస్తున్నరు. అయితే ఆ విషయాన్ని ఐదు నియోజకవర్గాల ప్రజలు గమనిస్తున్నారు. ప్రజా ఓట్లతో గెలిచిన నాయకులు ఆదోని జిల్లా విషయంలో వారి యొక్క ఆధిపత్యం నాయకులు ద్వారా పరిష్కారం చేయలేకపోతున్నారు. ఇకపోతే కనీసం ప్రతిపక్ష ఆది నాయకులను ఆధోనికి పిలిపించి ఆదోనిని జిల్లా చేస్తామని తీర్మానం చేయలేకపోతున్నారు. అధికారపక్షంలో ఉన్నటువంటి టిడిపి ,జనసేన, బిజెపి పార్టీ నాయకులు కేవలం వాళ్ళ యొక్క పదవుల దృష్ట్యా ఆదోని జిల్లా ఉద్యమంలో పాల్గొన్నారే తప్ప నిజంగా ఆదోని జిల్లా ఏర్పాటుకు కృషి చేయాలని ఆలోచన వారికి లేదు. అది కాక ఆదోని జిల్లా ఉద్యమాన్ని నిర్వార్యం చేయాలని ఒక్కొక్క పార్టీ ఒక్కొక ఏజెంట్ ని ఆదోని జిల్లా ఉద్యమంలో పాల్గొనే విధంగా చేశారు. చివరికి ఆదోని పోరాటాన్ని మట్టికరిపించడానికి ప్రయత్నం చేసి చివరికి ఎటువంటి హామీ లేకుండా ఉద్యమాన్ని నీరు గర్చే ప్రయత్నం చేశారు. దాన్ని గమనించిన ప్రజాసంఘాల నాయకులు, కొన్ని రాజకీయ పార్టీల నాయకులు, మహిళా సంఘాల నాయకులు ఆ ఉద్యమాన్ని అందిపుచ్చుకొని ఆదోని జిల్లా ప్రకటించేంతవరకు ఈ ఉద్యమాన్ని కొనసాగించడానికి సిద్ధమయ్యారు. అందుమూలంగానే ఈరోజుటికి 121వ రిలే నిరాహార దీక్షను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యమాన్ని జిల్లా ప్రకటించేంతవరకు ప్రజల్లో చైతన్యవంతం తీసుకొని వచ్చి రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు పుట్టిస్తామన్నారు. 121వ రోజు రిలే నిరాహార దీక్షలో రామాంజనేయులు, కే చంద్రబోస్, సుజ్ఞానమ్మ, వై జ్యోతి, వెంకోబా లు కూర్చొని ఆదోని జిల్లా సాధన ఉద్యమానికి మద్దతు తెలిపారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ,మహిళా సంఘాలు, ఆదోని జిల్లా ఆకాంక్ష ఉన్నవారు రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి ఆదోని పట్టణంలో భూ దందాల విషయం మాట్లాడడం మాని ఆదోని జిల్లా తీసుకురావడానికి కృషి చేయాలని హెచ్చరిక చేశారు. 121వ రోజు ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు పగడాల కోదండ, వైపి నాగరాజు, గుమ్మల బాలస్వామి, గోవిందు, జగన్, అయ్యలప్ప, ప్రకాష్, ప్రతినిత్యం ప్రకాష్ తదితరులు పాల్గొని ఈరోజు జరిగే రిలే నిరాహార దీక్షను విజయవంతం చేశారు