పయనించే సూర్యుడు బాపట్ల మార్చి 17 :-రిపోర్టర్ (కే శివకృష్ణ ) సింగారెడ్డి భగత్ సింగా రెడ్డి స్ఫూర్తితో.. పద్మారెడ్డి ఆశీస్సులతో సేవా కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసి మజ్జిగ పంపిణీ చేసిన పట్టణ సీఐ ఆర్. రాంబాబు అంబేద్కర్ సర్కిల్ వద్ద బాటసారులకు ఉపశమనం.. వేసవి ఎండలు మండుతున్న వేళ ప్రజల దాహార్తిని తీర్చేందుకు బాపట్ల పట్టణంలోని శ్రీ ఠాగూర్ స్కూల్ ఇన్స్టిట్యూట్ పూర్వ విద్యార్థులు ముందడుగు వేశారు. బత్తుల భగత్ సింగా రెడ్డి స్ఫూర్తితో, పద్మారెడ్డి ఆశీస్సులతో బాపట్ల అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం పట్టణ సీఐ ఆర్. రాంబాబు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ ఆర్. రాంబాబు మాట్లాడుతూ.. ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో బాటసారులు, సామాన్య ప్రజల అవసరాలను గుర్తించి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. శ్రీ ఠాగూర్ ఇన్స్టిట్యూట్ పూర్వ విద్యార్థులు అందరూ ఒకే తాటిపైకి వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని కొనియాడారు. చదువుకున్న పాఠశాల పేరును, సమాజం పట్ల తమ బాధ్యతను నిలుపుకుంటున్నారని ఆయన ప్రశంసించారు. ప్రారంభోత్సవం అనంతరం పూర్వ విద్యార్థులు బాటసారులకు, వాహనదారులకు చల్లని మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ వేసవి కాలం అంతా ఈ చలివేంద్రం ద్వారా ప్రజలకు సేవలందిస్తామని నిర్వాహకులు తెలిపారు. శ్రీ ఠాగూర్ ఇన్స్టిట్యూట్ పూర్వ విద్యార్థుల బృందం. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, పట్టణ ప్రముఖులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.