పయనించే సూర్యుడు మార్చి 17 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య :సిపిఐ ఎంఎల్ మావోయిస్టు పార్టీపై కొనసాగుతున్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయాలని సామాజిక కార్యకర్త కొరిమి వెంకటస్వామి డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో సోమవారం నాడు విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. తమపై నిషేధం ఎత్తివేస్తే చట్టబద్ధంగా రాజ్యాంగ బద్ధంగా ప్రజాక్షేత్రంలో రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తామని సదరు మావోయిస్టు నాయకులు ప్రకటిస్తున్నారని ఆయన తెలిపారు. అలాంటప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం కొనసాగించకుండా ఎత్తివేయాలని ఆయన పేర్కొన్నారు సిపిఐ ఎం.ఎల్ మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి బీర్పూర్ లక్ష్మణరావు అలియాస్ గణపతి ఎక్కడ ఉన్నాడో ప్రకటిస్తామని సదర్ పార్టీ నాయకులు దేవా జి మల్లారెడ్డి లు ప్రకటించారని ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన కోరారు . రాజకీయ ఖైదీలను .ఉపా కేసులన్నింటినీ ఎత్తివేయాలని వెంకటస్వామి కోరారు