యూరియా యాప్ ని రద్దు చేయాలిబెల్లంకొండ సత్యనారాయణసిపిఎం మండల కార్యదర్శి

పయనించే సూర్యడు మార్చి 17 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు నడిగూడెం: ఈరోజు నడిగూడెం మండల కేంద్రంలోని సిపిఎం ఆఫీసులో సిపిఎం మండల కమిటీ సమావేశం కామ్రేడ్ కోరుట్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ మాట్లాడుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న యూరియా యఫ్ ని రద్దు చేసి పాత పద్ధతిలో రైతులకు సరిపడా యూరియా సప్లై చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రేకతిరుపయ్య, బీరవల్లి సుధాకర్ రెడ్డి, బెల్లంకొండ హనుమయ్య, ఎస్కే సైదా హుస్సేన్, ఎస్కే మస్తాన్, సంపత్ పిచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.