పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి.17.2026 పోలవరం జిల్లా ఇంచార్జ్, మద్దిటి అంజిరెడ్డి మాట్లాడుతూ. ఆదివాసి సంక్షేమ పరిషత్ రిజిస్ట్రేషన్ నెంబర్ 274/16 జిల్లా అధ్యక్షుడు తీగల బాబురావు మాట్లాడిన మాటలకి నేను గౌరవిస్తూ భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు పెట్టడం జరిగింది. అందులో కొందరు అవినీతి రాజకీయ నాయకుల వల్ల ఆదివాసీలకు అందవలసిన హక్కులను రాయితీలను ఫలాలను వారి వద్దకు చేరకపోవడం వల్ల వాటిని ప్రతిఘటిస్తూ అందులోంచి పుట్టుక వచ్చిన నాయకత్వ లక్షణాలతో ఉన్నవారు.ప్రజాసంఘాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. వారు ప్రజలకు అందవలసిన రాయితీలను పథకాలను కాపాడుట కోసం ఈ సంఘ నాయకులు ఇందులో భాగంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆదివాసి సంక్షేమ రిజిస్ట్రషన్ నెంబర్ 38 98/90 ఈ ఆదివాసి సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా బంగారు వెంకటేష్ రాష్ట్ర కార్యదర్శిగా పూనెం చిన్న వీరభద్రం బాధ్యత నిర్వహిస్తున్నారు.ఇప్పుడు ఆదివాసి సంక్షేమ పరిషత్ రిజిస్ట్రేషన్ నెంబర్ 274/16 ఆ యొక్క ఆదివాసి సంక్షేమ పరిషత్ 1990లో రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు. ఈ యొక్క ఆదివాసీ సంక్షేమ పరిషత్ 2016 లో రిజిస్ట్రేషన్ చేసియున్నారు.కానీ ఆ యొక్క ఆదివాసి సంక్షేమ పరిషత్ కి ఎటువంటి సంబంధం లేదని అందరూ తెలుసుకోవాలని తెలియజేస్తున్నాం. ఎవరి సంక్షేమ సంఘం వారిది.ఇందుమూలంగా తెలియజేయడమైనది. ఏమనగా… ఈ యొక్క భారత ఆదివాసి పార్టీకి ప్రతి ఆదివాసి సంఘాలు ప్రతి ఆదివాసి సంక్షేమ సంఘం సంక్షేమ పరిషత్ అందరూ మాకు కావాలి అందరూ మాకు మద్దతు ఇవ్వాలని కోరుచున్నాము.ఎవరు మద్దతిచ్చిన మేము ఎవరిని వదులుకోలేము మద్దతు ఇవ్వడం అనేది ఆ సంఘాల యొక్క ప్రధాన నాయకుల ఇష్టా ఇష్టాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అంతేగాని మేము ఎవరిని బలవంతంగా చేర్చుకోమని తెలియజేయడమైనది. మాకు మద్దతు ఇచ్చిన ఇవ్వకపోయినా వాళ్లకు ఎటువంటి సమస్యలు ఉన్న ఎటువంటి ఇబ్బందులు ఉన్న ఈ యొక్క భారత ఆదివాసి పార్టీ వాళ్లకు ముందుంది.మరియు వెన్నదండలుగా నడుస్తుందని వారికి సమస్యలు పూర్తిగా వరకు మేము వాళ్లకు ముందుని నడిపిస్తామని తెలియజేయడమైనది.జై ఆదివాసి జై జై ఆదివాసి భారత ఆదివాసి పార్టీ పోలవరం జిల్లా ఇంచార్జ్ మద్దిటి అంజి రెడ్డి.