రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో భూమిని కోల్పోతున్న బాధిత రైతులకు ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని, భూ సేకరణకు రైతులు సహకరించాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ మార్చ్ 17 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా సోమవారం గజ్వేల్ సమీకృత కార్యాలయ సముదాయం లోని మీటింగ్ హాల్ లో రీజనల్ రింగ్ రోడ్డు వలన భూమి కోల్పోతున్న జగదేవ్ పూర్ మండలం చెబర్తి, అల్రాజీపేట, పిర్లపల్లి, ఇటిక్యాల గ్రామాల రైతులతో ఆర్బిటరేషన్ ప్రక్రియ గూర్చి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం గుండా రీజనల్ రింగ్ రోడ్డు వెళ్తున్నందున ఈ ప్రాంత అభివృద్ధి కోసం భూమిని ఇవ్వడానికి ఒప్పుకోవడం శుభపరిణామం. మీప్రజావసరాల కోసం భూమిని త్యాగం చేస్తున్న మీకు ప్రభుత్వ తరపున దక్కాల్సిన నష్టపరిహారం త్వరగా అందేలా చూస్తామని భూమిని త్వరగా అందించేందుకు రైతులు ముందుకు రావాలని సూచించారు. ప్రభుత్వ నియమావళి ప్రకారం అందరికీ ఆమోద యోగ్యమైన పరిహారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, తహసిల్దార్ నిర్మల తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *