పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 17 రిపోర్టర్ అభి పెద్దకడబూరు మండలంలో రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి నరవరమాకంతరెడ్డి “అన్నదాత సుఖీభవ” మూడో విడత నిధుల విడుదల సందర్భంగా రైతులకు సమాచారం అందజేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, రైతులకు లభించే ప్రయోజనాల గురించి వివరించారు. అలాగే రైతులకు కరపత్రాలను పంపిణీ చేసి పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీలర్లు ఇమ్మనేలు, ఆదాం, హనుమంతు, స్కూలు కమిటీ చైర్మన్ హనుమంతు, దేవసవాయం, బొగ్గుల నరసన్న, సుధాకర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.