రైతుల కృతజ్ఞత సభ మాట ప్రకారం నిధులు విడుదల చేయించిన మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ,

వెల్జీపురం గ్రామంలోని దాదాపు 150 మంది రైతులు కృతజ్ఞతగా పాలాభిషేకం.

పయనిమచె సూర్యుడు న్యూస్: మార్చి/17 :నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం వెల్జీపురం గ్రామం లోని రైతుల కృతజ్ఞత సభ మాట ప్రకారం నిధులు విడుదల చేయించిన 11/6 కెనాల్‌కు నిధులు విడుదల చేయడం ద్వారా వెల్జీపురం గ్రామంలోని వందల ఎకరాలకు సాగునీటి సమస్యలు తీరనున్న నేపథ్యంలో, ఇచ్చిన మాట ప్రకారం నిధులు విడుదల చేయించిన మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, వెల్జీపురం గ్రామంలోని దాదాపు 150 మంది రైతులు కృతజ్ఞతగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రులు మల్లు భట్టి విక్రమార్క , ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరియు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాయిని నవీన్ కుమార్ మాట్లాడుతూ రైతుల సమస్యల పట్ల ఎల్లప్పుడూ స్పందిస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకొని 11/6 కెనాల్‌కు నిధులు విడుదల చేయించడంలో కృషి చేసిన ఎమ్మెల్యే కంపల్లి సత్యనారాయణ, మరోసారి రైతు బాంధవుడుగా నిలిచారని తెలిపారు మాజీ సర్పంచ్ గుండా వెంకన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని ప్రభుత్వం ప్రజా పాలనను అమలు చేస్తూ దొరల పాలనకు భిన్నంగా అభివృద్ధి సంక్షేమంలో ముందంజలో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు: ఏ ఎం సి డైరెక్టర్ కంకణాల రాంప్రసాద్ రెడ్డ, వార్డు సభ్యులు – గొల్ల కమిటీ మల్లవ్వ శంకర్, బొజ్జ శ్రీనివాస్, సంగెపు వేణు, సంగెం ముత్తవ్వ, దేశెట్టి కవిత, బాబు చందర్, చిట్యాల శ్రీనివాస్, మహిళా రైతులు, గ్రామ పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *