పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మార్చ్ 17 మెట్‌పల్లి పట్టణంలోని 15వ వార్డులో రోడ్లపై ఉన్న గుంతల వల్ల వాహనదారులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన వార్డు కౌన్సిలర్ అరిగెల అనూష–రాకేష్ మున్సిపల్ సిబ్బందితో మాట్లాడి తాత్కాలికంగా సమస్యను పరిష్కరించే చర్యలు చేపట్టారు. గుంతలు ఉన్న ప్రాంతాల్లో అలాగే మట్టి రోడ్లు సరిగా లేని చోట్ల మట్టితో మరమ్మతులు చేయించి రహదారులను సవరించారు. ఈ సందర్భంగా అరిగెల రాకేష్ మాట్లాడుతూ వార్డులో రోడ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం త్వరలోనే మున్సిపల్ కమిషనర్, ఛైర్మన్‌లతో మాట్లాడి రోడ్లు బాగా లేని ప్రాంతాల్లో అలాగే సీసీ రోడ్డు సదుపాయం లేని చోట్ల కొత్త రోడ్లు వేయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ వార్డు సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా సహకరిస్తున్న మున్సిపల్ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.