విద్య కోసం నా సహాయo – మీ పేరుమా ళ్ళ శ్రీనివాస్

పయనించే సూర్యుడు 17 మార్చి 2026 చిన్నంబావి మండలం వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మీ శ్రేయభిలాషి ఫౌండేషన్ డైరెక్టర్ పెరు మాళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ చిన్నంబావి మండలంలో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెబుతూ విద్యార్థుల ఉన్నత చదువు కొరకు మా ఫౌండేషన్ కార్యాలయంలో ఉచిత ఆన్లైన్ సేవలు కల్పించనున్నట్లు తెలిపారు. మండలంలోని ప్రతి పాఠశాలలో ప్రథమ.ద్వితీయ.తృతీయ.స్థానాల్లో ర్యాంకులు సాధించే పదో తరగతి విద్యార్థులకు భవిష్యత్తు చదువులకై టీఎస్ ఆర్ జె సి.పాలిసెట్.అగ్రిసెట్.ఐటిఐ.ఎంప్లాయిమెంట్ తదితర కార్డులు ఆన్లైన్ ద్వారా చేయబడునని కావలసినవారు మైత్రి మీ సేవల సంప్రదించాలని తెలిపారు.మా ఫౌండేషన్ 2014 నుండి గత 11 ఏళ్లుగా ఉచిత ఆన్లైన్ సేవలు అందిస్తున్నామని వందలాది విద్యార్థులకు సేవలు అందించడమే తమ ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ఉచితంగా ఆన్లైన్ సేవలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మీ సేవ ఫౌండేషన్ డైరెక్టర్ పెరుమాళ్ళ శ్రీనివాసులు గతంలో ఉచితంగా సేవలు పొందిన విద్యార్థులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *