పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 17.03.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) భాష సంయుక్త రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు . కంస్యవిగ్రహం ప్రతిష్టించుచున్న సందర్భముగా చౌడేపల్లి బజారు వీధిలోని కన్యకా పరమేశ్వరి దేవస్థానము ముందర వాసవి సేవకులు ఆర్యవైశ్య మహిళా మండలి మరియు వాసవి క్లబ్ వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూజా కార్యక్రమం అనంతరం స్వీట్స్ పంచడం జరిగినది 1901వ సంవత్సరం మార్చి 16వ తేదీన నెల్లూరు జిల్లాలో జన్మించారు 1952 అక్టోబర్ 19న ఆమరణ నిరాహారదీక్ష చేసి 58రోజులు పోరాడి డిసెంబర్ 15వ తేదీన ప్రాణాలు అర్పించారు 58 రోజులు నిరాహార దీక్ష కు గుర్తుగా 58 అడుగులు విగ్రహమును అమరావతిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిష్టించడం జరిగిందని ఆర్యవైశ్య ప్రముఖులు అన్నారు