శిథిలావస్థలో ఉన్న పాఠశాల తరగతి గదులను పరిశీలించిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి

మండల విద్యాధికారి

పయనించే సూర్యుడు, కోరుట్ల మార్చి 17 సోమవారం రోజున కోరుట్ల మండలంలోని అయిలపూర్, సర్పరాజ్ పూర్,కల్లూరు మండల పరిషత్ పాఠశాలల శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను మండల అభివృద్ధి అధికారి వి.రామకృష్ణ మరియు మండల విద్యాధికారి గంగుల నరేశం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం సర్పరాజ్ పూర్,కల్లూరు పాఠశాల ఒక్కొక్క తరగతి గదిని, ఐలాపూర్ పాఠశాలలోని ఆరు తరగతులు కూల్చివేసేందుకు అనుమతి పొందినందున వాటిని కూల్చివేసి వాటి స్థానములో నూతన తరగతి గదులు నిర్మాణం చేపట్టి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావలన్నారు. ఈ కార్యక్రమంలో అయిలపూర్ సర్పంచి రామకృష్ణ, సర్పరాజ్ పూర్ సర్పంచి రాజ్ కుమార్, కల్లూరు సర్పంచి చీట్నేని లత-రమేష్ ప్రధానోపాధ్యాయులు నర్సింహమూర్తి, కిష్టయ్య, నరహరి, సంతోష్ లు పాల్గొన్నారు.