పయనించే సూర్యుడు మార్చి 17 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో మా సోమవారం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనారిటీ మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కొత్తూరు మండలం మహిళా విభాగం అధ్యక్షురాలు మిస్రుద్ బేగం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సిద్ధాపూర్ గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముప్పై మంది మహిళలకు మూడు నెలల పాటు ఉచితంగా టైలరింగ్ కోర్సు నేర్పించనున్నారు. మహిళలు స్వయం ఉపాధి పొందేలా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ శిక్షణ ద్వారా మహిళలు టైలరింగ్‌లో ప్రావీణ్యం సాధించి తమ కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమానికి గ్రామంలోని మహిళలు ఉత్సాహంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సిద్దాపూర్ గ్రామ సర్పంచ్ విస్లావత్ బాసు నాయక్ మరియు కొత్తూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరినాథ్ రెడ్డి మరియు సిద్ధాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లారం శేఖర్ రెడ్డి వార్డు సభ్యులు మాజీ ఎంపీటీసీ జంగయ్య తదితరులు పాల్గొన్నారు.