సిసి రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్, వార్డు సభ్యులు

పయనించే సూర్యుడు మార్చ్ 17 పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ పాపన్నపేట మండల పరిధిలోని డాక్య తండాలో సీసీ రోడ్ల నిర్మాణానికి సోమవారం కొబ్బరికాయ కొట్టి పనులను తాండ సర్పంచి గుగులోత్ స్వప్న హీరోలాల్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ స్వప్న మాట్లాడుతూ.. తండాలో ప్రతి వీధిలో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టి మౌలిక వసతులు మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్, వార్డు సభ్యులు విట్టల్, నాయకులు తులసి రామ్, ప్రేమ్ కుమార్, గణేష్, జనార్దన్ రెడ్డి, రవి, రామ్ చందర్, రాజు కిషన్ తదితరులు పాల్గొన్నారు.