సోషల్ మీడియా అధ్యక్షునిగా మరోసారి ముచ్చిక నాగార్జున నియామకం

పయనించే సూర్యుడు ప్రతినిధి జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ మర్చి 17 పోలవారం జిల్లా,చింతూరు మండలం, వైయస్సార్ పార్టీ ఆవిర్భావం నుంచి నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతు ప్రజా ఆదరణ పొందుతూ అది నేత అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ తనపై నమ్మకం తో 2016 లో చింతూరు మండల సోషల్ మీడియా అధ్యక్షులు గా నియమించింది.2021 నుంచి 2026 వరకు చింతూరు మండలం కుమ్మురు పంచాయితీ సర్పంచ్ గా పనిచేస్తూ.మరల రెండోసారి పార్టీ అధిష్టానం మేరకు సోషల్ మీడియా అధ్యక్షులు గా నియమించింది.ఈ సందర్భంగా ముచ్చిక నాగార్జున మాట్లాడుతూ నా పై నమ్మకం తో నాకు సోషల్ మీడియా బాధ్యతలు ఇచ్చినా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ఎం.ఎల్.సి.అనంత ఉదయ్ భాస్కర్ బాబు కి రంపచోడవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి కి చింతూరు మండల అధ్యక్షులు వై.రామలింగారెడ్డి కి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులు కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *