హుండీ లెక్కింపులో రూ.3.85 లక్షల ఆదాయం

* అపర బద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో పారదర్శకంగా లెక్కింపు * ఆరు నెలలు 10 రోజుల్లో భక్తుల విరాళాలు రూ.3,85,202

పయనించే సూర్యుడు / మార్చి 17 / దిడ్డి రాము / జమ్మికుంట రూరల్ ; ఇల్లంతకుంటలోని అపర బద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సోమవారం (మార్చి 16) భక్తజనుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో గత సంవత్సరం సెప్టెంబర్ 6, 2025 నుండి నేటి వరకు గల 6 నెలల 10 రోజుల కాలానికి హుండీ ద్వారా మొత్తం రూ.3,85,202 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కరీంనగర్ డివిజన్ పరిశీలకులు పి. సత్యనారాయణ పర్యవేక్షణలో ఈ హుండీ లెక్కింపు జరిగింది ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సుమన్‌కర్, ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కాశం వెంకటదాసులు, మడికొండ నవీన్ కుమార్ శర్మతో పాటు ఆలయ సిబ్బంది మల్లారెడ్డి, సురేందర్ రావు, ప్రవీణ్, రమేష్, రాజేందర్, రాంబాబు పాల్గొని హుండీ లెక్కింపులో సహకరించారు. దేవస్థానానికి భక్తులు అందిస్తున్న విరాళాలు ఆలయ అభివృద్ధి, నిర్వహణ మరియు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు వినియోగిస్తామని దేవస్థానం అధికారులు తెలిపారు. ఇటీవల ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత పనులు, మరమ్మతులు, రంగులు వేయడం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు, పండుగలు, జాతరలు, బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ దేవాలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని, భక్తుల విశ్వాసంతో ఆలయం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *