పయనించే సూర్యుడు: మార్చి 18/26 సత్తుపల్లి రూలర్: రిపోర్టర్: గద్దె. విజయబాబు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పరిధిలోని జడ్పీఎస్ఎస్ లింగగూడెం కాంప్లెక్స్ లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న. సిఆర్పి. శీలం. గోపాలకృష్ణ జూన్ 2025 నుంచి విధుల్లో చేరడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వేతనాలు లేక కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు కుమార్తెలతో కుటుంబం పోషించుకోలేక ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారని. అధికారుల నిర్లక్ష్యం వల్లే నాకు రావలసిన వేతనం ఆగింది. ఖమ్మం డి ఈ ఓ ఆఫీస్ కి వెళ్లి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అక్కడ పని చేసే సిబ్బంది హైదరాబాదు స్టేట్ ఆఫీసుకు వెళ్లి నీ పెరోల్ ఐడి ని అప్రూవల్ చేయించుకోమని చెప్పారు. వారు చెప్పినట్లే హైదరాబాదు స్టేట్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ ఉన్న సిబ్బందిని కలవడం జరిగింది. రాష్ట్ర ఎస్ పి డి ఆఫీసులో మరియు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసులో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నా పేరోల్ ఐడిని అప్రూవల్ చేయించి జూన్ 2025 నుండి రావలసిన వేతనం ఇప్పించగలరు. అని కోరారు