అప్పుడు ఆదోని అభివృద్ధికి తాత అడ్డుపడ్డాడు ఇప్పుడు ఆదోని జిల్లాకు మనవడు అడ్డుపడుతున్నాడు

పయనించేసూర్యుడు న్యూస్ మార్చ్18 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి ఆదోని కేంద్రంగా ఐదు నియోజకవర్గాలను కలిపి జిల్లాగా ప్రకటించాలని గతంలో పార్లమెంటులో ఒక ఎంపీ కూడా మాట్లాడడం జరిగింది. అయితే అప్పుడు ఈ తరంలో ఉదృతమైన ఉద్యమము లేకపోవడం వల్ల రాజకీయ నాయకులు పెడిచెవున పెట్టీ ప్రజల్ని మభ్యపెట్టారు. గత 8,9 సంవత్సరాలుగా ఆదోని జిల్లా కోసమై ఉద్యమాలు ఉధృతం అవుతున్నాయి. అయినా కూడా రాజకీయ నాయకులు ఎటువంటి ఆలోచన చేయడం లేదు. అయితే ఇలా జరగడానికి కారణం స్వతంత్రం వచ్చినప్పటి నుండి వారి యొక్క స్వలాభం కోసం వారి యొక్క కెమికల్ ఫ్యాక్టరీల అభివృద్ధి కోసం, వారి పొలాల్లో పని మనుషుల కోసం ఎల్ ఎల్ సి (లెఫ్ట్ లెవెల్ కెనాల్) అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పొలాలకు కాలువ ఏర్పాటు చేసిన వారే నీళ్లు వదులుతారు. అలాంటి అవకాశం ఉన్నటువంటి మన ఆంధ్ర ప్రాంత బోర్డర్లో కాలువ వెళ్లే విధంగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడుదారులు మళ్లించి కర్నూలు పశ్చిమ ప్రాంతాన్ని ఎడారిగా మారే విధంగా తయారు చేశారు. అందుకే ఈ ప్రాంతంలో పొలాలకు నీటి సౌకర్యం లేక సంవత్సరం సంవత్సరానికి వలసలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. కనీసం ప్రభుత్వం వలసలు తగ్గించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎల్ఎల్సీ కాలువను ఆంధ్ర,కర్ణాటక చివరి సరిహద్దులలో వెళ్లే విధంగా ముత్తాతల కుట్రపన్నారు.అదే ఆలోచన ఇప్పుడు మునిమనుమడు ఆదోని జిల్లాకు అడ్డుపడుతున్నాడు. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా మేలుకోవాలి మనము ఎవరికోసం జీవిస్తున్నామో వారి భవిష్యత్తు తరాల కోసమైనా ఈ ఉద్యమానికి బలోపేతం చేసి ఆదోని జిల్లా సాధించేంతవరకు నిర్వారీయమంగా పోరాటం సాగించాలి. కర్నూలు పశ్చిమ ప్రాంత అభివృద్ధి కోసం నిధులు కాదు మేము అడుగుతున్నది. రాజ్యాంగంలో ఏదైతే 50 కిలోమీటర్ల దూరం కు జిల్లాను ఇవ్వవచ్చు అన్నా ప్రతిపాదన ఉందో దాన్ని తప్పకుండా కూటమి ప్రభుత్వం అమలు చేయాలి. అధికార పక్షము, ప్రతిపక్షము ఆదోని జిల్లా ఉద్యమంలోకి వారి ఏజెంట్లను ప్రవేశపెట్టి ఉద్యమాన్ని నిరుగార్చడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. అందుకే వీరి పైన ప్రజల్లో అనేక అనుమానాలు వక్తమౌతున్నవి.ఇప్పటికైనా కర్నూలు పశ్చిమ ప్రాంతమైన ఐదు నియోజకవర్గాల కేంద్రమైన ఆదోని పట్టణాన్ని జిల్లాగా ప్రకటించి పరిపాలన సౌలభ్యం కోసం కూటమి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోకపోతే ప్రజల్లో మీ ఉనికి కాలగర్భంలో కలిసిపోతుంది . ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు హెచ్చరిక చేశారు. 122వ రోజు రిలే నిరాహార దీక్షలో కోదండ, వైపి నాగరాజు, రామకృష్ణ, సుభాష్ చంద్రబోస్, రామాంజనేయులు కూర్చొని ఆదోని జిల్లా ఉద్యమానికి మద్దతు తెలిపారు. 122వ రోజు దీక్షకు కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవిశెట్టి , ఆలూరు జేఏసీ నాయకులు కత్తి రామాంజనేయులు, ఎమ్మార్పీఎస్ పట్టణ ఇంచార్జ్ మరియు జేఏసీ నాయకులు గుమ్మల బాలస్వామి, బిజెపి నాయకులు గోపాల చారి గోవిందరాజులు, గంగపుత్ర ప్రకాష్, జగన్, దాసరి నరేష్, దత్తు, మలిగే రామలింగయ్య తదితరులు దీక్షశిబిరంలో ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.