పయనించే సూర్యుడు మార్చ్ 18 ( గణేష్ టౌన్ రిపోర్టర్ వేములవాడ: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని వేములవాడ పట్టణ బీజేపీ నాయకులు విమర్శించారు. మంగళవారం గ్యారంటీలను తక్షణమే అమలు చేసి ప్రజలకు అందించాలని కోరుతూ తహసిల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ, రేగుల మల్లికార్జున్, కౌన్సిలర్లు కొండ్లెపు ముత్యం, మైలారం శ్రీనివాస్, వంగల శ్రీనివాస్,రేగుల శ్రీకాంత్, బోనాల శివ, మామిండ్ల లక్ష్మీరాజం రేగుల రాజ్ కుమార్, బిల్ల కృష్ణ, గుడిసె మనోజ్ కుమార్, వివేక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ చవితిలో నిండు అసెంబ్లీలో వందేమాతరం గీతాన్ని అవమానించి బహిష్కరించి వెళ్లిన ఎంఐఎం పార్టీ దిష్టిబొమ్మ దగ్దం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో నివసించాలంటే జాతీయగీతం వందేమాతర గీతం ఆలపించాల్సిందేనని హెచ్చరించారు.