ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే గౌతు శిరీష ఆకస్మిక తనిఖీ

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 18 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోగల కాశీబుగ్గ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని సౌకర్యాలను, విద్యాబోధనను పరిశీలించిన ఆమె, అనంతరం విద్యార్థులతో కలిసి కాసేపు ముచ్చటించారు. మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాలకు వెళ్లిన ఎమ్మెల్యే, విద్యార్థులతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని చేశారు. ఆహారం నాణ్యతగా ఉందని, రుచిపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం మెనూ ప్రకారం సక్రమంగా అందుతుందో లేదో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజనములో నాణ్యత ఎక్కడా రాజీ పడకూడదని నిర్వాహకులను ఆదేశించారు. విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు పాఠశాల నిర్వహణ తీరును పరిశీలించిన అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చిన్నమ నాయుడుకు ప్రశంసించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *