ఎక్సైజ్ శాఖలో ఎస్సై రిజర్వేషన్లలో అన్యాయం

పయనించే సూర్యుడు అనంతపురం టౌన్ ప్రతినిధి నాగేంద్ర మార్చు 18: అఖిల భారత్ యువజన సమాఖ్య (ఏ ఐ వై యఫ్ ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి మంగళగిరి ఎక్సైజ్ శాఖలో ఎస్‌ఐ రివర్షన్లలో అన్యాయం – అడ్డిషనాల్ కమిషనర్‌ అనుసుయ్య దేవికి, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గండాల సంతోష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి మోజ్జడ యుగంధర్ వినతిపత్రం అందజేశారు.. ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖలో ఎస్‌ఐ రివర్షన్ల వ్యవహారంలో తీవ్ర అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయని అఖిల భారత్ యువజన సమాఖ్య ( ఏ ఐ వై ఎఫ్) రాష్ట్ర సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో .33ను సక్రమంగా అమలు చేయకుండా, అందులోని లొసుగులను ఉపయోగించి జూనియర్ అసిస్టెంట్లకు ( జే ఏ ) అధిక సంఖ్యలో ఎస్‌ఐ పదోన్నతులు కల్పించారని విమర్శించింది. నియమాల ప్రకారం 25% మాత్రమే ఉండాల్సిన జే ఏ పదోన్నతులను 48% వరకు పెంచడం, అదే సమయంలో 40% ఉండాల్సిన హెడ్ కానిస్టేబుళ్ల వాటాను తగ్గించడం ద్వారా క్రింది స్థాయి సిబ్బందిపై అన్యాయం జరిగిందని పేర్కొంది.ఇంకా, రివర్షన్ రావాల్సిన జేఏలను వదిలి, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 మంది హెడ్ కానిస్టేబుళ్లకు రివర్షన్ ఆర్డర్లు జారీ చేయడం వల్ల వారి వాటా 30% కూడా లేకుండా పడిపోయిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో జేఏ లలో కేవలం 6 మందికే రివర్షన్ ఇవ్వడం తీవ్ర అన్యాయంగా నిలిచిందని విమర్శించింది.ఈ అన్యాయాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, మంగళగిరిలోని కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కార్యాలయంలో అడ్డిషనల్ కమిషనర్ అనసూయ దేవికి ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర సమితి నాయకులు వినతిపత్రం సమర్పించారు.ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో.33ను కచ్చితంగా అమలు చేసి, హెడ్ కానిస్టేబుళ్లకు న్యాయం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *