ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్,రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 95వ వర్ధంతి ఫుల్ పోస్టర్లు విడుదల

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు దేశామోని ఆంజనేయులు

పయనించే సూర్యుడు. మార్చి 18. నాగర్ కర్నూల్ జిల్లా. తెల్కపల్లి మండలం రిపోర్టర్ :సుల్తాన్. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సిపిఐ ఆఫీస్ కామ్రేడ్ లక్ష్మణ చారి భవనంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన యువజనోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించిన ఎస్ఎండి ఫయాజ్ దేశామోని ఆంజనేయులు. మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 95వ వర్ధంతి సందర్భంగా అఖిల భారత యువజన సమాఖ్య.ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న యువజనోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను ఏ ఐ వై ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో విడుదల చేశారాని వారు అన్నారు.షహీద్ భగత్ సింగ్,రాజ్ గురు, సుఖ్ దేవ్ లు దేశ స్వాతంత్య్రం కోసం ఉరికొయ్యలను సైతం లెక్కచేయకుండా, భవిష్యత్తు తరాల కోసం బ్రిటీష్ ముష్కరులను ఎదిరించి వీరోచిత పోరాటాలు చేసి వీరమరణం పొందరన్నారు. కానీ, భగత్ సింగ్ కలలుగన్న స్వరాజ్య ఆకాంక్షలకు అనుగుణంగా నేటి విద్యార్థులు,యువత పయనుంచడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దేశానికే ఆదర్శప్రాయుడైన భగత్ సింగ్ స్పూర్తితో నేటి యువత చెడు మార్గాలను,చెడు అలవాట్లను విడనాడాలని వారు పిలుపునిచ్చారు. కుల,మతాలకు అతీతంగా ధనిక, పేద తారతమ్యాలు లేని, అవినీతి రహిత సమసమాజ స్థాపన కలలుకన్నాడని వారు అన్నారు. మతోన్మాద ముక్త భారతం సాధించడానికి భగత్ ఆలోచనలు, ఆయన చూపిన కార్యచరణ, మనకు తరగని స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. మతోన్మాద రాజకీయాలను సమూలంగా ఓడించడమే భగత్ సింగ్ కు నేటితరం అందించగలిగే నిజమైన నివాళి అని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వాడల బాల పిరు ఆఫీస్ బేరర్స్ విష్ణు సిపిఐ నాయకులు లక్ష్మీపతి,గోపి చారి కృష్ణాజి, మరియు రవీందర్ వెంకటయ్య,దేవేందర్ తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *