కౌతాళం టౌన్‌లో అన్నదాత-సుఖీభవ 3వ విడత ఇంటింటి ప్రచారం కొనసాగింపు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 18 రిపోర్టర్ అభి కౌతాళం రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు కౌతాళం టౌన్‌లో “అన్నదాత-సుఖీభవ” పథకం 3వ విడత ఇంటింటి ప్రచారం రెండవ రోజు కూడా కొనసాగింది. మంత్రాలయం ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి, కౌతాళం మండల అధ్యక్షులు సురేష్ నాయుడు, కౌతాళం సొసైటీ చైర్మన్ వెంకటపతి రాజు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది. కౌతాళం టౌన్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజా నందు ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పథకం ప్రయోజనాలను వివరించారు. అన్నదాత-సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సహాయ నిధులు జమ చేయడం జరిగిందని తెలియజేశారు. అలాగే రైతులకు ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహం, ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న వ్యవసాయ పరికరాలు, వడ్డీ లేని రుణాల గురించి సవివరంగా అవగాహన కల్పించారు. ఈ పథకాల ద్వారా రైతులు ఆర్థికంగా బలోపేతం కావడమే లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌతాళం టౌన్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజా నందు, తెలుగు యువత నాయకులు ముకన్న, గొట్టయ్య, రేవన్న, అయ్యప్ప, అలాగే వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం గ్రామస్థుల స్పందనతో విజయవంతంగా కొనసాగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *