
పయనించే సూర్యుడు మార్చి 18 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఖానాపురం చెరువు అలుగు వాగు స్థానిక ఆరవ డివిజన్ నుండి ప్రారంభమై వయా పది పదకొండవ డివిజన్ నుండి లకారం చెరువులో వాగు నీళ్లు కలవకుండా లకారం చెరువు పక్కనుండి ప్రత్యేక కాలువ త్రవ్వి వాగు నీటిని దారి మళ్లించడంతో ఆ నీళ్లు కబేళా మీదుగా దంసలాపురం చెరువులో కలుస్తున్నాయి, అలుగు వాగు దాదాపు పదిహేను కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణంలో అనేక దురాక్రమణలకు గురవుతూ వస్తుంది, ఇరిగేషన్, రెవెన్యూ డిపార్ట్మెట్ల అసలు నగిషా ప్రకారం ముప్పై మూడు మీటర్ల వెడల్పు ఉండాలి కానీ “నానాటికి తీసికట్టు నామమం బొట్టు” అనే రీతిలో ఇష్టారీతిన వాగును ఆక్రమించి పెద్ద భవనాలు, అపార్ట్మెంట్లు, పాఠశాలలు నిర్మించారు మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలకు విరుద్ధంగా అలుగు వాగును ఆక్రమించి నిర్మించిన కార్పోరేట్ పాఠశాల ముఖ్యంగా బైపాస్ రోడ్డు అయ్యప్ప స్వామి ఆలయం నుండి మొదలు పెట్టీ మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ఇంటి వరకు ఏదేచ్చుగా వాగును ఆక్రమించి అపార్ట్మెంట్లు నిర్మించిన దాఖలాలు కోకొల్లలుగా ఉన్నాయి, ప్రధానంగా ఓ కార్పొరేట్ పాఠశాల పూర్తిగా వాగును ఆక్రమించి బహుళ అంతస్తుల స్కూల్ బిల్డింగ్ నిర్మించారు, ఈ బిల్డింగ్ నిర్మాణం మీద గత కొన్నెండ్లుగా అనేక రకాల ఆరోపణలు వస్తున్నప్పటికీ ఇటు ఇరిగేషన్ అధికారుల్లో గాని మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల్లో గాని కనీసం చలనం లేకపోవడంతో అధికారుల పనితీరుపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి, గతంలో మంత్రి తుమ్మల, నాటి కలెక్టర్ ఆ ప్రాంతాన్ని రెండు సార్లు సందర్శించారు ఆ క్రమంలో స్థానికుల నుండి వచ్చిన పిర్యాదు మేరకు ఆ భవనాన్ని కూల్చాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు అదేశాలు జారీ చేశారు కానీ, ఆ అదేశాలు గానే మిగిలి పోయాయి తప్ప ఎటువంటి తొలగింపులు జరగలేదు, ఒక విధంగా చెప్పాలంటే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మంత్రి ఆదేశాలనే భేఖాతరు చేశారంటే సామాన్యుల పరిస్థితి ఏమిటనేది ఊహించుకుంటేనే భయం పుడుతుంది అలుగు వాగును పూర్తిగా ఆక్రమించి కట్టిన బహుళ అంతస్తుల భవనాలు ఈ అడ్డగోలు ఆక్రమణల నేపథ్యంలోనే 2024 సెప్టెంబర్ ఒకటవ తేదీన వచ్చిన వరదల కారణంగా అలుగు వాగు పరిసర ప్రాంతాల్లో నివసించే ఇళ్ల వాళ్ళు అనేక అవస్థలు పడ్డారు, అకస్మాత్తుగా ముంచుకొచ్చిన వరదను కంట్రోల్ చేసే పరిస్థితి లేక ఇంట్లో సామాన్లు, కార్లు, మోటారు సైకిళ్ళు అన్ని వదిలేసి బ్రతుకు జీవుడా అంటూ మెట్ట ప్రాంతాలకు చేరుకున్నారు, ఇంత జరుగుతున్న స్ధానిక కార్పొరేటర్లు తమ ప్రజలను వరద నుండి కాపాడుకున్నారు తప్ప ఏ ఒక్క అధికారి అటువైపు కన్నెత్తి చూడలేదని స్థానికులు స్థానికులు ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు, అలుగు వాగు ఆక్రమణల తొలగింపు విషయంలో స్థానిక ప్రజల నుండి ఇంత వ్యతిరేకత వస్తున్నా ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గానీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, కమీషనర్ ఎందుకు స్పందించడంలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు, మంత్రి తుమ్మల కార్పొరేట్ స్కూలు భవనాన్ని తొలగించమని చెప్పి కలెక్టర్ కు, మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ కు అదేశాలు జారీ చేసినప్పటికీ మంత్రి తుమ్మలకు తెలియకుండానే తన ప్రధాన అనుచరుడు ఒకరు మున్సిపల్ కమీషనర్ మీద ఒత్తిడి తీసుకువచ్చి తొలగింపు ప్రక్రియను అడ్డుకున్నట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, అంతే కాకుండా ఈ విషయంలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు స్థానికుల్లో చర్చ జరగడం గమనార్హం అదే విధంగా వైరా రోడ్డుకు దక్షిణం వైపు నాగార్జున ఫంక్షన్ హాల్ పక్కనుండి అలుగు వాగుని అనుకుని నిర్మించిన ఉన్నత వర్గాలు నివసించే ప్రతిష్టాత్మకమైన అపార్ట్మెంట్ ప్రహరీ గోడ కూడా మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు,ఈ నిర్మాణాన్ని గతంలో మున్సిపల్ అధికారులు రెండు సార్లు కూల్చినప్పటికీ సదరు బిల్డర్ యధావిధిగా నిర్మించడం విశేషం, ఈ ప్రహరీ గోడ పునర్నిర్మాణం అంశాలు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో పని చేసే ఒక అధికారిని పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుని చూసి చూడనట్లు వ్యవహరించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి, అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం క్రింద అలుగు వాగు పునరుద్ధరణ కోసం దాదాపు రెండు వందల తొంబై కోట్ల రూపాయలు మంజూరి చేసింది, పనులైతే ప్రారంభం అయ్యాయి కానీ అవి నత్త నడకను తలపిస్తున్నాయి, ఏది ఏమైనా అలుగు వాగు దురాక్రమణలను తొలగించి రాబోయే వర్షాకాలంలోనైనా వరదలు ముంచెత్తకుండా ఆ ప్రాంత ప్రజలను కాపాడాలని మంత్రి తుమ్మలను స్థానికులు కోరుతున్నారు